
ఢిల్లీ ఐఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. దిల్లీలోని ఐఐటీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తమ ఇంట్లో వెయిట్ లిఫ్టింగ్ రాడ్ కి దుపట్టాతో ఉరేసుకున్నాడు. ఈఘటన మంగళవారం సాయంత్రం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.మృతుడిని 23 ఏళ్ల పనవ్ జైన్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా ఒత్తిడి,డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, అందుకు చికిత్స తీసుకుంటున్నాడని పనవ్ తండ్రి చెప్పినట్లు తెలిసింది.
పనవ్ తల్లితండ్రులు మంగళవారం ఈవెనింగ్ వాక్ నుండి వచ్చాక అతని మృతదేహాన్ని కనుగొన్నారు. వారు వెంటనే బాధితుడిని పుష్పాంజలి ఆసుపత్రికి తీసుకెళ్లారు,అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారని వారు తెలిపారు.సూసైడ్ నోట్ లభించలేదని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
IIT-Delhi student dies by suicide, found dead at his residence in Delhi https://t.co/VBx2vHv4Bt
— THE HINDUSTAN GAZETTE (@THGEnglish) November 2, 2023