LOADING...
AP Heatwave : ఏపీలో ఎండల ఎఫెక్ట్‌.. 64 మండలాల్లో హీట్‌వేవ్ అలర్ట్
ఏపీలో ఎండల ఎఫెక్ట్‌.. 64 మండలాల్లో హీట్‌వేవ్ అలర్ట్

AP Heatwave : ఏపీలో ఎండల ఎఫెక్ట్‌.. 64 మండలాల్లో హీట్‌వేవ్ అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు. రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 45.9 డిగ్రీలు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 252 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదైనట్లు వెల్లడించారు. శనివారం వడగాలుల ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విజయనగరం (8), పార్వతీపురం-మన్యం(10), పోలవరం(2), ఎన్టీఆర్(1), గుంటూరు(1), పల్నాడు(19), మార్కాపురం (6), ప్రకాశం (10), నెల్లూరు (3), తిరుపతి (4) జిల్లాల్లో కలిపి మొత్తం64 మండలాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయి.

వివరాలు

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ప్రజలు తీవ్ర ఎండ, అధిక తేమ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల్లో నెల్లూరు జిల్లాలోని గూడూరు 45.5 డిగ్రీలతో రెండో స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి, ఎన్టీఆర్ జిల్లాలోని తోర్రగూడిపాడు 45.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలోని అద్దంకి 44.6 డిగ్రీలు, ఏలూరు జిల్లాలోని అల్లిపల్లి, మార్కాపురం జిల్లాలోని పెదచెర్లోపల్లి 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి 44.4 డిగ్రీలు, గుంటూరు జిల్లాలోని చేబ్రోలు 44.1 డిగ్రీలు, బాపట్ల జిల్లాలోని కారంచేడు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement