Sunny Leone: సన్నీ లియోన్ అకౌంట్‌లోకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిధులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వ పథకం మహతారి వందన్ యోజన ద్వారా వివాహిత మహిళలకు అందించే రూ. 1000 సహాయ ధనం, తాజాగా ఒక సంచలనానికి కారణమైంది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రముఖ నటి సన్నీ లియోన్ కూడా లబ్ధి పొందినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అకౌంట్‌లో ప్రతి నెలా నేరుగా రూ.1000 జమ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ పథకం నిధులు అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతున్నదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు.
అకౌంట్‌ను సీజ్ చేయాలని బస్తర్ జిల్లా కలెక్టర్ ఆదేశం
ఈ క్రమంలో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు విచారణకు ఆదేశించారు. మహతారి వందన్ యోజన కింద, రాష్ట్రంలోని వివాహిత మహిళల ఖాతాల్లో రూ.1000 బదిలీ చేస్తారు. అయితే, సన్నీ లియోన్ పేరుతో వీరేంద్ర జోషి అనే వ్యక్తి అకౌంట్ తెరిచినట్లు గుర్తించారు.ఇతను తూలూర్ అనే ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది. ఈ అకౌంట్‌కి సంబంధించిన వివరాలు, ఆమె భర్త పేరు కూడా జానీ సిన్స్‌గా పేర్కొనబడ్డాయి. ఆఖరికి, ఈ అకౌంట్‌ను సీజ్ చేయాలని బస్తర్ జిల్లా కలెక్టర్ హారిస్ అధికారులను ఆదేశించారు. అంతేకాక, సన్నీ లియోన్ పేరు మీద జమ అయిన మొత్తం వసూలు చేయాలని స్పష్టం చేశారు.