Page Loader
AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో వాతావరణం స్పష్టంగా మారిపోయింది. వాతావరణ శాఖ ప్రకారం, జూన్ 9న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, రామగుండం ప్రాంతాల్లో సోమవారం గరిష్ఠంగా 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.

Details

కోసాంధ్రలో ఉక్కపోత

ఇక మహబూబ్‌నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశముందని వాతావరణ నివేదిక తెలియజేసింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరింత భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం ప్రజలను అయోమయంలోకి నెడుతోంది. కోస్తాంధ్రలో ఉక్కపోత తీవ్రంగా ఉండగా, కర్నూలు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. జూన్ 8 ఆదివారం అనకాపల్లిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై అత్యధికంగా నమోదైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

Details

రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు

అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ దాటాయి. నైరుతి పశ్చిమ దిశల నుంచి వచ్చే బలమైన గాలుల ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో పాటు గాలులు, వర్షాల కారణంగా రైతులు, కూలీలకు తీవ్రమైన అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికలను గమనించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.