LOADING...
Andhra Pradesh:55 డ్రోన్లు.. 400 సీసీ కెమెరాలతో నిఘా.. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి  
సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh:55 డ్రోన్లు.. 400 సీసీ కెమెరాలతో నిఘా.. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు (బుధవారం) అనంతపురంలో జరగనున్న 'సూపర్‌ సిక్స్.. సూపర్‌ హిట్‌' సభ కోసం పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ స్వయంగా నగరంలో ఉంటూ ఈ ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా తీసుకోవడంతో హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు వివిధ సూచనలు అందించారు. సభ కోసం ఉమ్మడి అనంతతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు, సిబ్బందిని నియమించారు.

వివరాలు 

బందోబస్తు  పర్యవేక్షించడానికి.. 

బందోబస్తును సమర్థంగా పర్యవేక్షించడానికి 28 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు (ఐజీపీ, డీఐజీ, ఎస్పీలు), 15 మంది అదనపు ఎస్పీలు, 66 మంది డీఎస్పీలు, 200 మంది సీఐలు, 430 మంది ఎస్సైలు, 630 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 2950 మంది కానిస్టేబుళ్లు, 280 మంది మహిళా పోలీసులు, 420 మంది హోంగార్డులు, 360 మంది ఏఆర్‌ సిబ్బంది, 500 మంది ప్రోటోకాల్‌ సిబ్బంది, 14 మంది ప్రత్యేక పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు.

వివరాలు 

సభా ప్రాంగణంలో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

విజయోత్సవ సభ భద్రత కోసం 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రముఖులు ప్రయాణించే రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయనున్నారు. సభ పూర్తిగా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీని కోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయబడింది. ఈ విభాగానికి డీఐజీ సత్యయేసు బాబు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.