LOADING...
Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్యాప్టివ్‌ మైనింగ్‌ అనే పదాన్ని తొలగించడం ద్వారా అక్రమాలకు మార్గం సుగమం చేశారని, ఆ ప్రక్రియలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని సీబీఐ వాదించింది. ఆమె పదవిలో ఉన్న సమయంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Details

డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు

సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుతున్నామని జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ ధర్మాసనం పేర్కొంది. పొరపాటున ఇచ్చిన స్టేను నిందితులు ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించింది. అదేవిధంగా, ట్రయల్‌ కోర్టులో విచారణను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement