Page Loader
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం 
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల వెల్లడించడంలో గోప్యత సరైనది కాదని సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎస్‌బిఐకి సూచించింది. ఎస్‌బిఐ పరిధిలో ఉన్నఅన్ని వివరాలను ఎలక్టోరల్ బాండ్ల నంబర్లతో సహా బహిర్గతం చేయాలనీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన ఏ సమాచారం కోరినా,ఆ సమాచారం అంతా ఈసీఐకి అందించిందని,ఎస్‌బీఐ తన వద్ద ఉంచుకున్నసమాచారం ఏదీ లేదని ఎస్‌బీఐ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విధంగా,ఈసీకి బాండ్ నంబర్‌ను వెంటనే అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం,గురువారం(మార్చి 21)నాటికి, ఎన్నికల కమిషన్‌కు మొత్తం సమాచారం అందించినట్లు ఎస్‌బిఐ కోర్టులో అఫిడవిట్ సమర్పించాలి.

Embed

 ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు 

"SBI can't be selective in disclosing all details" - #SupremeCourt.#ElectoralBonds https://t.co/BLqDiRpMwu— Live Law (@LiveLawIndia) March 18, 2024