Page Loader
మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం
పిటిషనర్ పై ప్రశ్నలవర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 06, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో మోసపూరిత మతమతమార్పిడిలపై సుప్రీంకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలోనే పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. మత మార్పిడిలను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణకు ధర్మాసం తిరస్కరించింది. ఈ అంశంలో న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లను నిలదీసింది. ఇలాంటి విషయాల్లో తాము ప్రభుత్వాలకు, మాండమస్‌ రిట్‌లను ఎలా జారీ చేయొచ్చో వెల్లడించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం అర్జీదారులకు చురకలు అంటించింది.

DETAILS

పిల్ అంటే ఆటవస్తువులా మారింది

కర్ణాటక న్యాయవాది జిరోమ్‌ అన్టో హిందువులు, మైనర్లను మోసపూరిత మతమార్పిడిలు చేయిస్తున్నారని పిల్ దాఖలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం, పిల్‌ అంటే ఓ ఆటవస్తువులా తయారైందని మొట్టికాయలు వేసింది. ఇలాంటి వ్యాజ్యాలపై తాము సలహాలు ఇచ్చేవాళ్లం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేయాలి మరో కేసులో లద్దాఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎస్ఈసీ ఆగస్ట్ 5న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 7 రోజుల్లోగా కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉత్తర్వులు చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు నాగలి గుర్తును కేటాయించడంపై అభ్యంతరం తెలుపుతూ లద్దాఖ్ పరిపాలనా శాఖ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేస్తూ లద్దాఖ్​ పరిపాలనా శాఖకు రూ.లక్ష ఫైన్ విధించింది.