Page Loader
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు

వ్రాసిన వారు Stalin
May 29, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇవాళ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓ వారం రోజులు బెయిల్ పొడింగించాలన్న ఆయన పిటిషన్ ను అనుమతించడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రరీ తిరస్కరించింది. పిటిషన్ ప్రాధమిక దశలోనే తిరస్కరణకు గురైెంది. దీనితో జూన్ 2 న ఆయన పోలీసుల ముందు లొంగిపోవాల్సి వుంటుంది. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నాయని వైద్య పరీక్షలకు అవకాశం ఇవ్వాలని కోరారు. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కోరింది.

Details 

కేసు నేపధ్యమిది

మనీ లాండరింగ్ కేసులో ఈడీ మార్చి 21 న అరెస్ట్ చేసింది. పాత ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేసిన ప్రక్రియపై ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. బెయిల్ పై వున్న రోజుల్లో అధికారిక విధులకు హాజరు కారాదని షరతు విధించింది. ఫైళ్లపై సంతకాలు చేయకూడదని ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా దేనిపై సంతకాలు వద్దంది.

Details 

కొత్త పాలసీని తెచ్చే క్రమంలో అవకతవకలు

సుప్రీం కోర్టు కొత్త పాలసీని తెచ్చే క్రమంలో అవకతవకలు జరిగాయని వ్యాఖ్యానించింది. 2021-22 మధ్య కాలానికి ఢిల్లీ సర్కార్ నవంబర్ లో ఎక్సైజ్ పాలసీ తెచ్చింది. కానీ ఏడాది ముగియగానే దానిని రద్దు చేసింది. మద్యం వ్యాపారుల సిండికేట్ కు 12 నుంచి 15 శాతం లాభాలు వచ్చేలా ఈ పాలసీలో మార్పులు తెచ్చింది. అర్హత లేని వ్యక్తులకు లాభాలు చేకూర్చేలా పాలసీ మార్చారని ED కేసు నమోదు చేసింది. అయితే ఈ వాదనను ఢిల్లీ సర్కార్ తోసి పుచ్చింది. మరింత ఆదాయం పెరుగుతుందని చెప్పుకొంది.