మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
ఎస్ బ్యాంక్ (YES BANK) సహ వ్యవస్థాపకుడు రానా కపూర్ కు సుప్రీంకోర్టులో చుక్కైదురైంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ (DFHL) మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కపూర్, బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రానా కపూర్ బెయిల్ పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీం, ఈ కేసు మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ బ్యాంక్ ఏటీ 1 బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లకు అక్రమంగా విక్రయించిన కేసులో రాణా కపూర్ రూ. 2.2 కోట్లు మేర జరిమానా చెల్లించాలని జూన్ లో సెబీ ఆదేశించింది.
రూ.900 కోట్ల రుణ మంజూరులో కపూర్ అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ
సదరు మొత్తాన్ని ఆగస్ట్ 8 లోగా చెల్లించంటే రానా కపూర్ స్థిర, చరాస్థుల ద్వారా ఆయా నిధులను వసూలు చేస్తామని తేల్చి సెబీ చెప్పింది. మరోవైపు మార్చి 2020 నుంచి రానా కపూర్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో రూ. 900 కోట్ల రుణాల మంజూరీలో అవకతవకలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఈడీ రానా కపూర్‌ను అరెస్టు చేసింది. హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (HDIL) ప్రమోటర్లు రాకేష్ వాధ్‌వన్, ఆయన కుమారుడు సారంగ్‌లకు భారీ మొత్తంలో రుణాన్ని అందించారు. ఈ క్రమంలోనే కపూర్ పై మనీ లాండరింగ్‌కు సంబంధించిన పలు కేసులను ఈడీ నమోదు చేసింది.
రానా కపూర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
Supreme Court refuses to entertain bail plea of Yes Bank founder Rana Kapoor in a money-laundering case against him. Kapoor withdraws bail plea from Supreme Court. SC notes that this case rocked the entire financial system. (file photo) pic.twitter.com/7VykNOw1Sm— ANI (@ANI) August 4, 2023