మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
ఎట్టకేలకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.ఈ మేరకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తాను నిర్దోషినని రాహుల్ దాఖలు చేసిన అఫిడవిట్ ను త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని రాహుల్ తరఫు అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. మోదీ పేరును తన పేరుకు కాల క్రమంలో జతకలిపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు రాహుల్ నిర్దోషిగా విడుదలై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇదే చివరి అవకాశమన్న న్యాయవాది, గతంలోనూ ఆయనకు ఏ కేసులోనూ శిక్ష పడలేదని కోర్టుకు తెలిపారు.