Supreme Court: కోర్టు విచారణ రికార్డింగ్‌ల షేరింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం,న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాతో కలిసి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష ప్రసారమవుతున్న కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో దుర్వినియోగం అవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలకు కూడా నోటీసులు జారీ
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో,వీడియో రికార్డింగ్‌లను సేకరించడం,మార్పులు చేయడం, ప్రచారం చేయడం,పోస్టు చేయడం,రీపోస్ట్ చేయడం లేదా ఇతర డిజిటల్ వేదికల్లో అప్‌లోడ్ చేయడం నిషేధమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలకు కూడా నోటీసులు జారీ చేసి వారి స్పందన కోరింది.
వివరాలు
ఈ విషయంలో నియంత్రణ అవసరం: తుషార్ మెహతా
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్,కోర్టు విచారణల వీడియోలను సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా వినియోగిస్తున్నారని వాదించారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా మద్దతు తెలుపుతూ, ఈ విషయంలో నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.
కేంద్రం, ఇతర సంబంధిత వర్గాల నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.