Page Loader
Supreme Court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

Supreme Court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, వర్గీకరణ అవసరమని జస్టిన్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6: 1 నిష్పత్తిలో తీర్పును వెలువరించింది. మూడ్రోజులు పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును ఇవాళ వెల్లడించింది.

Details

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణతో సామాజిక న్యాయం

వాల్మీకులు, ముఝాబీ సిక్కులను 50శాతం రిజర్వేషన్ కల్పించిన నిబంధనను పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక 2002లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం తీర్పును తప్పుబట్టింది. ఈ అంశంపై పున:సమీక్షించుకోవాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుందని, దీంతో సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర తెలిపింది.