Supreme Court: బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
'బుల్డోజర్ న్యాయం'ను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆక్టోబర్ 1వ తేదీ వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులపై బుల్డోజర్‌లను అనధికారికంగా నడిపించడంతో బాధితులకు ఉపశమనం కలిగించేందుకు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ఈ తరహా బుల్డోజర్ చర్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ చర్యలను "గొప్పతనం"గా "హీరోయిజం"గా చూపించకూడదని హెచ్చరించింది. వచ్చే విచారణ తేదీ వరకు మీ చర్యలను ఆపమని తాము కోరినంత మాత్రాన కొంపలేమని మునిగిపోవని జస్టిస్ గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషన్ కు నోటీసులు
ఇప్పటికే, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూ కశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నోటీసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. కోర్టు, బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణలను తొలగించడంపై తన ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు.
40-60 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి
సెప్టెంబర్ 2వ తేదీకి జరిగిన వాదనల్లో, దేశంలో ఎక్కడా ఈ తరహా చర్యల కోసం మార్గదర్శకాలను పాటించబడడం లేదని పేర్కొన్నారు. జామత్ ఉలేమా హింద్ ప్రధాన పిటిషనర్‌గా వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు కనీసం 40-60 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కూల్చివేట్లకు అధికారులను బాధ్యులుగా ప్రకటించాలని సుప్రీంకు నివేదించారు. యూపీ ప్రభుత్వానికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.