LOADING...
Bihar SIR: బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Bihar SIR: బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో జరుగుతున్న ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ చేపట్టిన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, ఎన్నికల సంఘం (Election Commission) రాజకీయ పార్టీల మధ్య విభేదాలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఓటర్ జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించడానికి సెప్టెంబర్‌ 1 డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణలో సుప్రీంకోర్టు, ఓటర్లకు అవగాహన కల్పించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బిహార్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ తరఫున కోర్టులో సమాధానం ఇస్తూ, సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, అలాగే నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని వెల్లడించింది.

Details

 ఆగస్టు 1న ఈసీ ఓటర్‌ జాబితా ముసాయిదాను విడుదల 

కోర్టు ఈ విషయాన్ని పిటిషనర్ల దృష్టికి తీసుకువచ్చింది. ఇక బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఆగస్టు 1న ఈసీ ఓటర్‌ జాబితా ముసాయిదాను విడుదల చేసింది. దాన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా తెలియజేయాలని ముందుగా ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముసాయిదా జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది ఓటర్ల వివరాలను తొలగించినట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు, పౌరసత్వంపై అనుమానాలున్న సుమారు 3 లక్షల మందికి (Doubtful Citizenship) నోటీసులు పంపినట్లు వెల్లడించింది.