Page Loader
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం 

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం 

వ్రాసిన వారు Stalin
Jun 09, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌ను చంపేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. వాట్సాప్ సందేశం ద్వారా శరద్ పవార్‌ను బెదరించినట్సు ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తల బృందంతో కలిసి ఆమె ముంబై పోలీసు చీఫ్ ఫన్ సల్కర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని సుప్రియా సూలే కోరారు. శరద్ పవార్‌ను ఓ వెబ్‌సైట్ ద్వారా బెదిరించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుప్రియా సూలే చెప్పారు.

ముంబై

హోం మంత్రిత్వ శాఖ జొక్యం చేసుకోవాలి: సుప్రియ 

అయితే ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శరద్ పవార్‌కు నరేంద్ర దభోల్కర్‌ గతినే పడుతుదని సందేశంలో పంపారని ఎన్‌సీపీ నాయకులు పోలీసులకు చెప్పారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్ట్ 20, 2013న పూణేలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. పవార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత హోం మంత్రిత్వ శాఖపై ఉందని సుప్రియ అన్నారు. హోం మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్‌సీపీ చీఫ్‌కు బెదిరింపు వచ్చినట్లు తమకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు. తాము దర్యాప్తును చేపట్టినట్లు వెల్లడించారు.