Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రత్యేకతలు ఇవే
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కార్పొరేట్ కార్యాలయం 'సూరత్ డైమండ్ బోర్స్'ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రూ.3400కోట్లతో నిర్మించిన ఈ కార్యాలయం 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత సూరత్ డైమండ్ బోర్స్ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ప్రసిద్ధికెక్కనుంది. సూరత్ డైమండ్ బోర్స్‌తో పాటు, సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాపారానికి మరింత అభివృద్ధి చెందనుంది. 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రారంభోత్సవం కోసం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల నుంచి 250 మందికి పైగా ప్రసిద్ధ డైమండ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో25 వేల మంది అతిథులు పాల్గొననున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సూరత్ డైమండ్ బోర్స్ ప్రత్యేకతలు
1.సూరత్ డైమండ్ బోర్స్ నిర్మాణానికి రూ.3400కోట్లు ఖర్చు చేశారు. 2.ఈ భవనం 35ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా మారుతుంది. 3.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టడ్ భవనం. దీనికి అనుసంధానంగా ప్రపంచవ్యాప్తంగా 4500కంటే ఎక్కువ కార్యాలయాలు ఉన్నాయి. 4.పెంటగాన్ విస్తీర్ణం కంటే సూరత్ డైమండ్ బోర్స్ భవనం పెద్దది. 5. ఈ భవనంలో 175దేశాల నుంచి వజ్రాలు కొనుగోలు చేయడానికి వచ్చే 4200 కంటే ఎక్కువ మంది వ్యాపారులకు వసతి కల్పించవచ్చు. 6.ఈ కార్యాలయం ద్వారా 1.5లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. 7.ఈ భవనం 80ఏళ్లుగా వజ్రాల వ్యాపారంలో నంబర్ 1గా ఉన్న పెంటగాన్‌ను సూరత్ డైమండ్ బోర్స్ అధిగమిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.