Sushil Kumar Modi: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బిహార్ రాజకీయాల్లో సుశీల్ మోదీకి భిన్నమైన గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో ఆయన జతకట్టడం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. క్యాన్సర్ కారణంగా కొంతకాలం అయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన స్వయంగా క్యాన్సర్‌పై పోరాటం గురించి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల మధ్య సుశీల్ కుమార్ మోదీ మరణం బీహార్ బీజేపీకి, జాతీయ నాయకత్వానికి పెద్ద దెబ్బ.
నాలుగు సభలలో సభ్యుడుగా పని చేసిన సుశీల్ కుమార్ మోదీ
పార్టీలో ఆయన కార్యాచరణ చాలా ప్రత్యేకం. డిప్యూటీ సీఎంతో పాటు రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. తన మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో, అయన రాజ్యసభ, లోక్‌సభ, శాసనమండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యుడుగా పని చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. ఇది బీహార్ బీజేపీకి తీరని లోటు అని అన్నారు. అదే సమయంలో, డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కూడా సుశీల్ కుమార్ మోదీ మరణం మొత్తం బీజేపీ సంస్థాగత కుటుంబానికి, నాలాంటి అసంఖ్యాక కార్యకర్తలకు కోలుకోలేని లోటు అని అభివర్ణించారు.