AP News: ముంబయి నటి వేధింపుల కేసు.. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా (Kanti Rana Tata), ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని (Vishal Gunni)లను గతంలో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సస్పెన్షన్ గడువు పూర్తయ్యిన నేపథ్యంలో, సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించింది.
వివరాలు
ముగ్గురు అధికారులపై పలు అభియోగాలు
ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో అరెస్టు చేసి, ఆమెను ఇబ్బందులకు గురిచేసిన ఘటనకు సంబంధించి ఈ ముగ్గురు అధికారులపై పలు అభియోగాలు ఉన్నాయి.
అఖిలభారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగాలు ఉండటంతో, రివ్యూ కమిటీ సిఫారసు మేరకు వారి సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.