Page Loader
Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి 
Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి

Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి 

వ్రాసిన వారు Stalin
Jun 23, 2024
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర లో మరో టీనేజర్ నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొనడంతో 19 ఏళ్ల యువకుడు మరణించాడు. ఆ రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరగడం ఇది రెండోది. పూణె-నాసిక్ జాతీయ రహదారిపై గత రాత్రి మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొంది.దీంతో 19 ఏళ్ల యువకుడు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మయూర్ మోహితను అరెస్టు చేశారు. అతను పూణే జిల్లా ఖేడ్ అలండి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యే అయిన దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందినవారు.

వివరాలు 

మద్యం సేవించలేదని ఎమ్మెల్యే కితాబు 

బాధితుడిని ఓం భలేరావుగా గుర్తించారు. మయూర్ మోహితే నడుపుతున్న టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రాంగ్ సైడ్ నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత మీడియాకు ఇచ్చిన ప్రకటనలో, తన మేనల్లుడు సంఘటనా స్థలం నుండి పారిపోలేదని శాసనసభ్యుడు చెప్పారు. అతను మత్తులో లేడని కూడా చెప్పుకొచ్చారు.ఈ ఘటనతో మళ్లీ పూణెలో ర్యాష్ డ్రైవింగ్‌పై దృష్టి సారించింది. గత నెలలో, ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రముఖ రియల్టర్‌కు చెందిన 17 ఏళ్ల కుమారుడు వేగంగా నడుపుతున్న పోర్స్చే వారి బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో మరణించారు.

వివరాలు 

అబ్జర్వేషన్ హోమ్‌కు టీనేజ్ యువకుడు 

మద్యం తాగి వాహనం నడుపుతున్న టీనేజ్ నిందితుడు ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ చర్య స్ధానిక ప్రజలతో పాటు జాతీయంగా ఆగ్రహానికి దారితీసింది . జువైనల్ జస్టిస్ బోర్డు తన ఉత్తర్వులను సవరించేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన టీనేజ్ యువకుడ్ని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించిన సంగతి విదితమే.