
Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఆధ్యాత్మికవేత్తగా పేరొందిన స్వామి నిత్యానంద గురించి తెలియని వారుండరు.
అయితే, నిత్యానంద స్థాపించిన కైలస దేశం భౌగోళికంగా ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.
తాజాగా నిత్యానంద మరణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిత్యానంద మరణ వార్తలపై ఆయన మేనల్లుడి ప్రకటన స్వామి
నిత్యానంద మరణించారని, ఆయన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేశారని నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సమాచారం పంపినట్లు కొన్ని వార్తలు వెల్లడించాయి.
ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.
Details
నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారు
స్వామి నిత్యానంద మరణించారనే వార్తలపై కైలాస దేశం అధికారికంగా స్పందించింది.
తమ గురువు నిత్యానంద పూర్తిగా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని, మరణ వార్తలన్నీ అసత్య ప్రచారమని వెల్లడించింది.
కొంతమంది దురుద్దేశంతో ఈ రూమర్లను వ్యాపింపజేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని కైలాస వర్గాలు పేర్కొన్నాయి.
నిత్యానంద మరణ వార్తలపై స్పష్టత
మార్చి 30న జరిగిన ఉగాది ఉత్సవాల్లో నిత్యానంద స్వయంగా పాల్గొన్నారని కైలాస దేశం ప్రకటించింది. ఈ వాదనను మరింత బలపరిచేందుకు ఓ లైవ్ స్ట్రీమ్ లింకును కూడా పంచుకుంది.
అయితే నిత్యానంద ప్రస్తుత నివాసం గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యానంద మరణ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టమవుతోంది.
Details
భారతదేశం విడిచిపోయిన నిత్యానంద
నిత్యానందపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. బలాత్కారం, అపహరణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన 2019లో దేశం విడిచిపెట్టి పరారయ్యారు.
అనంతరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే స్వతంత్ర హిందూ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు.
కైలాస దేశం వాస్తవమా? ఊహాజనితమా?
కైలాస దేశం దక్షిణ అమెరికాలోని ఎక్వడార్ సమీపంలో ఉందని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటి వరకు అక్కడికి బాహ్య ప్రపంచం నుంచి ఎవరు వెళ్లిన రికార్డులు లేవు.
నిత్యానంద స్థాపించిన ఈ దేశం ఎంతవరకు నిజమో ఇప్పటికీ సందేహమే. కానీ తాజా వార్తలతో నిత్యానంద మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు