
Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
స్వామి శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యోగా రంగానికి, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన అపూర్వ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
ప్రతీ తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఆయన మృతి యోగా ప్రపంచానికి ఇది తీరని లోటని పేర్కొన్నాడు. శివానంద 1896, ఆగస్టు 8న అప్పటి అవిభాజ్య భారతదేశంలోని సిల్హెత్ జిల్లా (ఇప్పటి బంగ్లాదేశ్)లోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు.
ఆయన ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు.
Details
గతంలో పద్మశ్రీ పురస్కారం అందజేత
అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. అక్కడ గురువు ఓంకారానంద గోస్వామి శిష్యునిగా స్వీకరించి, శివానందకు యోగా, ఆధ్యాత్మికతపై బోధనలు ఇచ్చారు.
అనంతరం ఆయన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా స్వామి శివానంద పూరీలో 400-600 కుష్టురోగులకు అంకితభావంతో సేవలు అందించారు.
యోగా, ఆధ్యాత్మిక సేవల పరంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించినప్పుడు, ఆయన తెల్లటి ధోవతి, కుర్తా ధరించి, పాదరక్షలు లేకుండా, అతి సాదాసీదాగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.