Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ
నిందితుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కూడా కోర్టుకు హాజరయ్యారు.బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్నిరిజర్వ్‌లో ఉంచింది. బిభవ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.విచారణలో కౌరవులు, ద్రౌపది గురించి ప్రస్తావించారు. కోర్టులో విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకుంది.ఈ కేసులో బిభవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సెక్షన్‌లకు ఎటువంటి సమర్థన లేదని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో ఐపీసీ 308 కింద కేసు నమోదు చేసినా ప్రయోజనం లేదన్నారు. స్వాతి మలివాల్‌ను సిఎం నివాసానికి పిలవలేదు,కానీ ఆమె బలవంతంగా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందన్నారు.