Page Loader
Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్న నిరసన చేపట్టారు.ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమె చెత్తను పోశారు. ఢిల్లీ మొత్తం చెత్తతో నిండిపోయిందని, ఆప్ ప్రభుత్వం దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వాతి మలివాల్, కేజ్రీవాల్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

వివరాలు 

రోడ్డుపై చెత్త కుప్పలు పెరిగి పోయాయని ఫిర్యాదు

"ఈ నిరసన ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు. ఇవాళ ఢిల్లీ గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన స్థితిలో ఉంది. నగరంలోని ప్రతి మూల చెత్తతో నిండిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.ఢిల్లీ మొత్తం చెత్త కుండీగా మారింది.నేను అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడటానికి ఇక్కడ వచ్చాను. ఆయన గూండాలకు లేదా పోలీసులకు నేను భయపడను' అని అన్నారు. అలాగే, వికాస్‌పురి నుంచి వచ్చిన మహిళలు రోడ్డుపై చెత్త కుప్పలు పెరిగి పోయాయని ఫిర్యాదు చేసినట్లు స్వాతి మలివాల్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినప్పటికీ, శుభ్రం చేసేందుకు ఎవరూ చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. దీంతో, స్థానిక మహిళలు నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఈ ప్రాంతానికి వచ్చారని వెల్లడించారు.

వివరాలు 

మూడు లారీల చెత్తను తీసుకుని కేజ్రీవాల్ నివాసం వద్దకి..

"ఈ చెత్తను అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్తాం. ఢిల్లీని ఆయన ఇచ్చిన ఈ మురికి నహుమతిని ఎలా పరిష్కరిస్తారు అనేది చూడాలి. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఢిల్లీ వాస్తవాలను అర్థం చేసుకోవడం లేదు" అని ఆమె మీడియాతో అన్నారు. దీనికి ముందు,మూడు లారీల చెత్తను తీసుకుని కేజ్రీవాల్ నివాసం వద్దకి వెళ్తానని స్వాతి మలివాల్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన అనుచరురాలిగా ఉండే స్వాతి ఆప్ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి,కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మారిపోయారు.గత ఏడాది మేలో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆయన అనుచరుడు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసుల అదుపులో స్వాతి