
Tajmahal: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను భయాందోళనకు గురిచేసింది.
అయితే, చివరికి అది బూటకమే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఒక గుర్తు తెలియని ఖాతా నుండి తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామని మెయిల్ అందింది.
దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్కాడ్, ఇతర ప్రత్యేక బృందాలు తాజ్‌మహల్, దాని పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టాయి.
వివరాలు
తాజ్‌మహల్ చుట్టూ భద్రత పెంపు
అయితే, అనుమానాస్పద వస్తువులు ఎక్కడా కనిపించలేదు, దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజ్‌మహల్ చుట్టూ భద్రతను మరింత పెంచినట్లు ఏసీపీ సయీద్ అరీబ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు.
మెయిల్ ఎక్కడి నుండి వచ్చినది, దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.
మెయిల్ వచ్చిన వెంటనే ఆగ్రా పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారమందించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వాత్స తెలిపారు.