Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో భాజపా కూడా తన ఎన్నికల హామీల పత్రాన్ని విడుదల చేసింది. మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రత,సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక హామీలను ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర నాయకుల సమక్షంలో ఈ హామీల పత్రాన్ని ఆవిష్కరించారు. కుటుంబాల్లో మహిళా పెద్దలకు నెలకు రెండు వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి ఇంటికి ఒకేసారి పది వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడాది మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
వివరాలు
బీజేపీ ఎన్నికల హామీలు ఇవే..
మహిళలకు ఇ-స్కూటర్ల కొనుగోలుపై రూ.25,000 రాయితీ జల్లికట్టు సంప్రదాయాన్ని ప్రోత్సహించేందుకు ఎద్దులను పెంచే వారికి నెలకు రెండు వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. జల్లికట్టు పోటీల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ప్రత్యేక సాయం అందిస్తామని తెలిపారు. ఇంటి అవసరాల కోసం మహిళలకు ఎనిమిది వేల రూపాయల విలువైన కూపన్లు అందజేసి, గృహోపకరణాల కొనుగోలు లేదా మార్పిడికి ఉపయోగపడేలా చేస్తామని పేర్కొన్నారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో భద్రత పెంచేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో స్థానిక నివాసితులకు ప్రతిరోజూ రెండు గంటల ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.