LOADING...
Vijay: ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం

Vijay: ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎల్‌టిటిఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు విజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన సామాజిక మాధ్యమ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. శ్రీలంకలో జరిగిన 'ముల్లివైకల్' ఘటనను గుర్తు చేసుకున్న విజయ్, ఆ సంఘటన తమిళుల హృదయాల్లో ఎప్పటికీ మాయని గాయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అక్కడి తమిళ ప్రజల హక్కుల పరిరక్షణకు తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

వివరాలు 

గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్

ఈనేపథ్యంలోనే భారతదేశంలో ఎల్‌టిటిఈపై ఇప్పటికీ నిషేధం అమల్లో ఉంది. శ్రీలంకలో తమిళుల హక్కుల సాధన కోసం ప్రభాకరన్ దాదాపు మూడుదశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని నడిపించారు. 2009 మేలో శ్రీలంక సైన్యం చేపట్టిన తుదిదాడితో'ముల్లివైకల్' ప్రాంతంలో ఆ పోరాటం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రతి ఏడాది మే 18ను 'ముల్లివైకల్ స్మారక దినం'గా నిర్వహిస్తుంటారు. సాధారణంగా తమిళనాడులో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభాకరన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించేందుకు దూరంగానే ఉంటాయి. అయితే విజయ్ గతంలో కూడా ప్రభాకరన్‌ను ప్రేమాభిమానాలు పంచిన నాయకుడిగా అభివర్ణించారు. ఇప్పటికే విజయ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి ఎల్‌టిటిఈ అనుకూల వైఖరి కలిగిన వీసీకే పార్టీ మద్దతు ఇస్తుండటంతో,తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌కు సీఎం విజయ్‌ నివాళి

Advertisement