LOADING...
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మలుపు: డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మలుపు: డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మలుపు: డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్!. ఇప్పటివరకు బద్ద రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై జాతీయ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని డీఎంకే పార్టీ ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి పది స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలతో మద్దతు ప్రకటించినప్పటికీ, విజయ్‌కు అవసరమైన సంఖ్యాబలం అందలేదు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

వివరాలు 

అన్నాడీఎంకేతో కలవబోమన్న డీఎంకే నాయకుడు

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. తమకు తగిన సంఖ్యాబలం ఉందని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు గవర్నర్‌కు సంకేతాలు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగినట్లు అన్నాడీఎంకే వర్గాలు అంగీకరించినప్పటికీ, ఆ చర్చల ఫలితం ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59 స్థానాలు, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కలిసినా మొత్తం 106 స్థానాలే అవుతాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఇది సరిపోదు. అందుకోసం వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతు కీలకం అవుతుంది. యితే అన్నాడీఎంకేతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని డీఎంకే అధికార ప్రతినిధి ఎ.శరవణన్ తెలిపారు.

Advertisement