Loading...
Tamil Nadu: తమిళనాడులో హాస్పిటల్ అనుమతులకు సింగిల్ విండో.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడులో హాస్పిటల్ అనుమతులకు సింగిల్ విండో.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Tamil Nadu: తమిళనాడులో హాస్పిటల్ అనుమతులకు సింగిల్ విండో.. ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హాస్పిటల్‌ల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వైద్య, ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు ఎదురవుతున్న జాప్యాన్ని తగ్గించడం లక్ష్యంగా రాష్ట్రంలో సింగిల్ విండో క్లియరెన్స్ (ఏకగవాక్ష) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండా, మొత్తం ప్రక్రియను ఒకే వేదిక ద్వారా కొన్ని నెలల్లో పూర్తి చేసే అవకాశం ఏర్పడనుంది.

వివరాలు 

వైద్య రంగ పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు

ఈ అంశంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశం అనంతరం సింగిల్ విండో విధానానికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ సంస్కరణ అమలుతో పారిశ్రామిక అభివృద్ధిలో ముందున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తరహాలో వైద్య రంగ పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరనుంది.

ప్రస్తుతం ఆసుపత్రుల భవన నిర్మాణాలు, ప్రాజెక్టు డిజైన్లు, ఇతర అనుమతుల కోసం వివిధ శాఖలను ఆశ్రయించాల్సి వస్తుండటంతో ప్రక్రియ నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో ఏళ్లపాటు కూడా కొనసాగుతోందని ఆరోగ్య రంగ ప్రతినిధులు చెబుతున్నారు.

వివరాలు 

అనుమతుల వ్యవహారంలో అక్రమాలు

ఈ అనుమతుల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

కొన్ని సందర్భాల్లో అనుమతుల కోసం రూ.40లక్షల నుంచి రూ.50లక్షల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగా రాష్ట్రంలో సుమారు 7 నుంచి 8మంది వైద్యులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణ ప్రాజెక్టులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

కొత్త సింగిల్ విండో విధానం అమల్లోకి వస్తే అనుమతుల కోసం పారదర్శకమైన, నిర్దిష్ట ఫీజు విధానం అమలులోకి రానుంది.

దీంతో అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

అలాగే అనుమతుల మంజూరు వేగవంతం కావడంతో కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు ఊతమివ్వడంతో పాటు వైద్య రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అనుమతుల వ్యవహారంలో అక్రమాలు

వైద్య రంగానికి చెందిన పరిశ్రమలు, ఆసుపత్రుల ప్రతినిధులు దాదాపు దశాబ్దకాలంగా సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.

వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

ADVERTISEMENT