Page Loader
తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు
విద్యార్థినిని కాపాడిన స్థానికులు

తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 30, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. విచక్షణారహితంగా మనుషులపై దాడులకు పూనుకుంటున్నాయి. దీంతో బయటకెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో దడ పుడుతోంది. తాజాగా ఓ వీధి కుక్క విద్యార్థినిపై దాడి చేసిన అమానుషకరమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. హోసూర్‌లో ఐదేళ్ల పాఠశాల విద్యార్థిని రోడ్డు మీద వెళ్తోంటే మూడు వీధి కుక్కలు చుట్టుముట్టాయి. అనంతరం ఆమె గౌన్ లాగుతూ ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాయి. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి హాహాకారాలు చేసింది. దీంతో కుక్కలు మరింత రెచ్చిపోయి దాడి చేశాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ ఘటనపై వెంటనే స్పందించాడు. ఈ క్రమంలోనే మరికొందరు స్థానికులతో కలిసి కుక్కలను తరిమేశారు. అనంతరం పాపను ఆస్పత్రికి తరలించారు.

details

5 ఏళ్ల తేజశ్రీపై 3 వీధి కుక్కల దాడి

సామాజిక మాధ్యమాల్లో సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని క్రిష్ణగిరి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు వాసవీనగర్‌కు చెందిన తేజశ్రీగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం తేజశ్రీ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో 3 కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. హోసూరులో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, వాటి నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నివాస ప్రాంతాలు,వీధులు, రహదారులపై వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ పాదచారులను, వాహనదారులను బెంబెలెత్తిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గత జూన్‌లో బాలాజీ వీధిలో 7 మందిని వీధి కుక్కలు కరిచాయి. జులైలో 65 ఏళ్ల మునీశ్వర్‌పై వీధి కుక్కలు దాడిచేశాయి. తీవ్ర గాయాలపాలైన బాధితుడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.