Page Loader
Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా 
శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా

Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా అందించనున్నారు. ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఈ నిర్ణయం తీసుకోగా, కేరళ దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్‌.వాసవన్‌ దీన్ని శనివారం ప్రకటించారు. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే యాత్రా సీజన్‌లో అయ్యప్ప స్వామి దర్శనం సాఫీగా సాగేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులకు సహాయం చేసేందుకు టీడీబీ వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తోంది. గత ఏడాది 15 లక్షల మందికి అన్నదానం చేయగా, ఈసారి 20 లక్షల మందికి అన్నదాన ఏర్పాట్లు చేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శబరిమల అయ్యప్ప భక్తులకు రూ.5లక్షల జీవితా బీమా