తదుపరి వార్తా కథనం

TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 22, 2024
12:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార - ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ 'భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో తెలుగుదేశం, 'సిద్ధం' పేరుతో వైసీపీ నేతలు సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే,ఈ సభల పేరుతో కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ ఇరు పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నాయి.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకు దిగజారాయ? ఇంతటి చిల్లర రాజకీయాలు అవసరమా? అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీలో 'కండోమ్' రాజకీయాలు
ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ కండోమ్ రాజకీయాలు! pic.twitter.com/fF65X7RHhu
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2024