Page Loader
చంద్రబాబు వ్యూహంతో తెలుగుదేశంలో జోష్.. కడపలో మహిళా అభ్యర్థికి టీడీపీ గ్రీన్ సిగ్నల్
కడపలో మహిళా అభ్యర్థిని నిలబెట్టనున్న టీడీపీ

చంద్రబాబు వ్యూహంతో తెలుగుదేశంలో జోష్.. కడపలో మహిళా అభ్యర్థికి టీడీపీ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇంఛార్జీలను ప్రకటించింది. ఈ మేరకు కడప బాధ్యులుగా ఆర్.మాధవీరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు బాధ్యులుగా విశ్రాంత ఐఏఎస్, బి.రామాంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్రబాబు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే క‌డ‌పలో మాధ‌వీరెడ్డి నియామ‌కం ఆసక్తి రేపుతోంది. క‌డ‌ప లోక్ సభ టీడీపీ అభ్య‌ర్థి ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి భార్య మాధ‌వీని క‌డ‌పలో నిల‌పాల‌ని చంద్ర‌బాబు ఫిక్స్ చేశారు. మాధవీ మామ మాజీ మంత్రి ఆర్‌.రాజ‌గోపాల్‌రెడ్డి, వైఎస్ కుటుంబంతో రాజకీయంగా పోరాడారు. క‌డ‌ప పార్ల‌మెంట్ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి గట్టి పోటీనిచ్చారు. ఇప్పటికే 2సార్లు క‌డ‌పలో గెలిచిన అంజాద్‌బాషా మూడోసారి పోటీ చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీ అధినేతకు ధన్యవాదలు చెప్పిన మాధవిరెడ్డి దంపతులు