ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.
అక్కడ అక్రమాలు చేసేది ఎవరో కాదని, వైకాపా ప్రజా ప్రతినిధులే ఈ అక్రమ మట్టి తవ్వకాల్లో పాలుపంచుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఓ పక్క దౌర్జన్యాలు చేస్తూనే మరోపక్కఅక్రమాలపై తమ హక్కుల కోసం నిరసిస్తున్న ఎస్సీలపై దాడులు చేస్తున్న నిందితులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
ఏనుగువానిలంక గ్రామంలో చించినాడ గ్రామ దళితులకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ భూములను కేటాయించింది. అయితే దాదాపు 60 ఏళ్లుగా ఆ భూములను ఎస్సీలే సాగు చేసుకుంటున్నారు.
DETAILS
పోలీసులు అధికార పార్టీకి గూండాల్లా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు
ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో వైకాపా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పాగా వేశారని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
అనంతరం ఆయా భూముల్లో నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ దాష్టీకాలపై ఈనెల 6న చించినాడ ఎస్సీలు నిరసనకు దిగారని, న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై లాఠీని ఝులిపించారని ఫైర్ అయ్యారు.
ఒక పక్క తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న ఎస్సీలను, సమీపంలోని పాలకొల్లు ఆస్పత్రికి కాకుండా దాదాపుగా 70 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న తాడేపల్లిగూడేనికి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి గూండాల్లా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.