TDP: 'లోకేశ్‌కు డిప్యూటీ..' ఈ అంశంపై కీలక ప్రకటన చేసిన టీడీపీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి న్యాయంగా నియమించాలని టీడీపీ క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై టీడీపీ అధిష్టానం తాజాగా స్పందించింది.ఈ డిమాండ్‌ను లేవనెత్తిననేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇలాంటి పరిణామాలు తీసుకురావడం సరి కాదని చురకలు అంటించింది.
ప్రజలు మనపై భారీ బాధ్యతను నెరవేర్చాలని,మన బాధ్యతను పెట్టారని.. మన బాధ్యత అభివృద్ధి, సంక్షేమ అని అన్నారు.
ఈ అంశంపై ఇకపై నేతలు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
కూటమి నేతలు ఒక నిర్ణయానికి చేరుకున్న తర్వాతే ఏమైనా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చింది.
వివరాలు
సీరియస్ గా స్పందించిన టీడీపీ అధిష్టానం
ఇకపోతే, నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసిన నాయకుల్లో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యమిస్తున్న పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ కూడా ఉన్నారు.
టీడీపీకి కోటి సభ్యత్వాలు కట్టిన నారా లోకేష్, డిప్యూటీ సీఎం పదవికి వంద శాతం అర్హుడని వర్మ అన్నారు.
"టీడీపీకి భవిష్యత్తు లేదని భావించే వారందరికీ 'యువగళం' ద్వారా లోకేష్ సమాధానం ఇచ్చారని" అన్నారు.
"నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి," అని వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ అధిష్టానం స్పందించి సీరియస్ అయ్యింది.