Page Loader
Nellore: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి!
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య

Nellore: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన లింగసముద్రం మండలంలో సంచలనం రేపుతోంది. తాతాహోటల్ సమీపంలోని జంపాలవారపాలెంలో టీడీపీ నాయకుడైన తోవూరి నరసింహాన్ని బ్రహ్మయ్య అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా,నరసింహం మృతదేహాన్ని రెండు రోజులపాటు ముక్కలు ముక్కలుగా నరికి, వాటిని బోరుబావిలో పడేసిన దారుణ తతంగం చోటు చేసుకుంది. ఈహింసాత్మక ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

వివరాలు 

నరసింహం కుటుంబ సభ్యులు పోలీసులకు  ఫిర్యాదు 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం,నరసింహం వద్ద నిమ్మతోటలో బ్రహ్మయ్య కాపలాదారుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఏ అంశం మీద విభేదం ఏర్పడిందో,నరసింహాన్ని ఈ స్థాయిలో దారుణంగా హత్య చేయడానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. నరసింహం కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితుడైన బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనంగా, పోలీసులు బోరుబావి వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో తలమునకలై ఉన్నారు.