నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ అలజడి ఏర్పడింది. ఆరోపణలు, సవాళ్లు,ప్రతిసవాళ్లతో పొలిటికల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చుతోంది.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి త్వరలోనే పార్టీ మారనున్నారని పార్టీ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి అన్నారు.
దీంతో కంగుతిన్న ఆదాల తాను పార్టీ మారట్లేదు మొర్రో అంటూ సంచలన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎన్నికల ముందు పార్టీలు మారడం అలవాటేనని, 2019 ఎన్నికల సమయంలోనూ టీడీపీ బీఫామ్ తీసుకున్నారన్నారు.
అయితే ప్రభుత్వం నుంచి తనకు కాంట్రాక్ట్ బకాయిలు వసూలుకావడంతో ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు.
DETAILS
అబద్దాలు ప్రచారం చేయడం సోమిరెడ్డికే చెల్లుతుంది : ఆదాల
టీడీపీ ప్రచారం పర్వం నుంచి తప్పుకున్న ఆదాల, నేరుగా జగన్ ను కలిసి నెల్లూరు ఎంపీ టిక్కెట్ తెచ్చుకున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు.
అయితే ఉన్నఫలంగా టీడీపీ అభ్యర్థిగా బీదా మస్తాన్ రావుని నిలబెట్టామన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆదాలను, బీదా మస్తాన్ రావు అనుసరించి వైసీపీలోకే జారిపోయారన్నారు.
ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కూడా ఆదాల మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తారని జోస్యం చెప్పారు.
ఆయన టీడీపీలోకే వస్తారని, అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రమే వస్తారన్నారు. దీంతో నెల్లూరులో మాటాల తూటాలు పేలాయి.
సోమిరెడ్డి మాటలు ఇరుకున పెట్టడంతో ఆదాల వివరణ ఇచ్చారు.తాను వైసీపీని వీడబోనని ప్రకటించారు.అబద్దాలు ప్రచారం చేయడం సోమిరెడ్డికే చెల్లుతుందని అన్నారు.