
AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ
ఈ వార్తాకథనం ఏంటి
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్,ఇతర తెలుగుదేశం నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి... లోకేశ్‌ను కలవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఈరోజు ఉదయం ఐటీ సంస్థ సిస్కో,స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది.
ఈ సందర్భంలో, ఇప్పాల రవీంద్రారెడ్డి సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో హాజరయ్యారు.
వివరాలు
సిస్కో సంస్థకు ఘాటుగా లేఖ
రవీంద్రారెడ్డి హాజరైన విషయంపై తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గతంలో అతను చేసిన అసభ్య పోస్టులను కూడా తెలుగుదేశం నేతలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తున్నారు.
లోకేశ్‌ను కలిసేందుకు అతనికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లోకేశ్ వ్యక్తిగత సహాయకుడు (ఓఎస్డీ) సిస్కో సంస్థకు ఘాటుగా లేఖ రాశారు.
ఇప్పాల రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో తమ పార్టీ నాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టుల గురించి ఆ లేఖలో ప్రస్తావించారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టులలో రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరారు.తాము పంపిన మెయిల్‌పై వెంటనే సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లోకేశ్ వ్యక్తిగత సహాయకుడు సిస్కో సంస్థకు రాసిన లేఖ
సిస్కో ఇండియా టెరిటరీ ఎకౌంట్ మేనేజర్ (వైసీపీ సోషల్ మీడియా తరపున తెలుగుదేశం నాయకులపై బూతులతో పోస్టులు వేసిన) ఇప్పాల రవీంద్ర రెడ్డి ని ఏపీ కి చెందిన ఏ ప్రాజెక్ట్స్ లో అయినా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ చేయవద్దు అని సిస్కో కు లేఖ రాసిన నారా లోకేష్ గారి కార్యాలయం pic.twitter.com/OHj9CivrHG
— anigalla🇮🇳 (@anigalla) March 25, 2025