తదుపరి వార్తా కథనం

Pulivendula TDP Win: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 14, 2025
11:15 am
ఈ వార్తాకథనం ఏంటి
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు జెండా ఎగరేశారు. ఆమె 5,794 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మాత్రం డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయారు. ఆయనకు కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు 100 లోపు ఓట్లకే పరిమితమయ్యారు. విజయానంతరం మంత్రి సవిత, లతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు నిజమైన స్వేచ్ఛ లభించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల కోటను కూలదోయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.