LOADING...
Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్‌.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య 
ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య

Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్‌.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలోని దారుణం జరిగింది. ఓ విద్యార్థిని గురించి ఆమె క్లాస్‌మేట్‌కు అవమానకరంగా మెసేజ్ చేశాడు ఓ డ్రాయింగ్ టీచర్‌. దింతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య చేసుకుందుకు ప్రేరేపించిన ఆరోపణలపై పోలీసులు ఆర్ట్ టీచర్‌ను అరెస్టు చేశారు. ధర్మస్థలంలోని పిజతడ్కకు చెందిన బాలిక విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 7న మంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమెను రెండు రోజుల క్రితం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

Details 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

సోమవారం,ఉపాధ్యాయుడు తన గురించి మరొక విద్యార్థికి తప్పుగా సందేశాన్ని పంపినందుకు అవమానంగా భావించిన బాలిక ఆత్మహత్య చేసుకుందుకు ప్రేరేపించిన ఆరోపణలపై పోలీసులు ఆర్ట్ టీచర్‌ను అరెస్టు చేశారు. ధర్మస్థల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య