Tech Mahindra: సత్యం కేసులో టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
సత్యం కంప్యూటర్స్ స్కాంలో ఇరుక్కొన్న ఈ సంస్థను చేజిక్కించుకున్న టెక్ మహీంద్రకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది.
2002-09 మధ్య కాలంలో సత్యం కంపెనీ వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్నును లెక్కించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని పన్ను విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది.
సత్యం కుంభకోణం నేపథ్యంలో 2002-09 కాలానికి సంబంధించి వాస్తవ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని పన్ను లెక్కించేందుకు సీబీడీటీ (Central Board of Direct Taxes) అనుమతి నిరాకరించింది.
దీనిని సవాలు చేస్తూ టెక్ మహీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Details
ఊహాజనిత ఆదాయంపై పన్ను సరైంది కాదు
ఈ కేసును జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.
విచారణలో సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు లేనిది ఉన్నట్లు చూపించారని* దాన్ని ఆధారంగా పెట్టుకుని టెక్ మహీంద్ర పన్ను చెల్లించాలని చెప్పడం తగదని సంస్థ వాదించింది.
టెక్ మహీంద్ర వాదనను ధర్మాసనం సమర్థించింది. కంపెనీ వాస్తవ ఆదాయంపైనే పన్ను విధించాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో టెక్ మహీంద్రకు న్యాయపరంగా ఊరట లభించింది.