గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది. శంషదాబాద్ విమానాశ్రయానికి మళ్లించిన తర్వాత ఉదయం 6:15 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంపై స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించినట్లు పేర్కొంది.
విమానంలో 137 మంది ప్రయాణికులు, అంతా సురక్షితం: డీజీసీఏ
విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరూ సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ తెలిపింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు బాడీ కూడా తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విమానం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉందని, అవసరమైన తనిఖీలు జరుగుతున్నాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఎటువంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు, ప్రయాణికులను వారణాసికి తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు రోజు కూడా వారణాసి నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణలోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.