Loading...
Delhi: దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

Delhi: దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్నేహితులను నమ్మి వారితో బయటకు వెళ్లిన 17ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి, మృతదేహాన్ని పొలాల్లో పడేసినట్లు వెల్లడించారు.ఆ తర్వాత మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అతడితో పాటు అతడికి పరిచయమున్న మరో ముగ్గురు మైనర్లు కూడా ఆమెతో కలిసి టెంపోలో ప్రయాణించారు. ఆ వాహనంలోనే నలుగురు మద్యం సేవించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని పొలాల్లోకి విసిరేసినట్లు తెలిపారు.

వివరాలు 

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం గుర్తింపు

ఉత్తర దిల్లీలోని స్వరూప్‌ నగర్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 13న బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

అప్పటికే అది తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. మృతదేహం బాలికదా, బాలుడిదా అనే విషయం కూడా వెంటనే నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది.

ఒక చేయి శరీరం నుంచి వేరుపడినట్లు అధికారులు తెలిపారు. శరీరంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కుతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

బాలిక ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజులు గడిచినా.. ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

బాలిక తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లి, రోజుల తరబడి తిరిగి రాదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహం లభించిన ప్రాంతానికి చేరుకున్నారు.

వివరాలు 

సీసీటీవీ ఆధారంగా నలుగురు అదుపులోకి

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ టెంపో వాహనం కదలికలను గుర్తించారు.

దాని ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

ADVERTISEMENT