Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలను రూపొందించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరటనిచ్చింది. తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను విచారించింది. ఈ కేసులో తీస్తా సెతల్వాద్‌పై చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో, ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు వెంటనే లొంగిపోవాలని అంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.