NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
    తదుపరి వార్తా కథనం
    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
    7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ డ్రామా

    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా

    వ్రాసిన వారు Stalin
    Jan 19, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామ శివార్లలోని కొండగట్టులో కారు దగ్ధమై, ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోలేదని రూ. 7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ మర్డర్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది.

    తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న ధర్మానాయక్ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటు పడి రూ.కోట్లలో అప్పుల పాలయ్యాడు. పథకం ప్రకారం, గతేడాది రూ.7.4కోట్ల విలువైన 25 బీమా పాలసీలను తీసుకున్నాడు.

    బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు ఈనెల 9న కొండగట్టు వద్ద కారులో ఓ వ్యక్తిని తగలబెట్టి, తానే చనిపోయినట్లు సనీఫక్కీలో భారీ మోసానికి ధర్మానాయక్ తెరలేపాడు. దీనికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

    తెలంగాణ

    మరి కారులో చనిపోయింది ఎవరు? పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి

    ధర్మానాయక్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అతని పేరిట భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలిసీలు ఉన్నట్లు తెలిసింది. ఈక్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు ధర్మానాయక్ భార్య ఫోన్‌ను ట్యాప్ చేశారు.

    కొన్ని రోజుల తర్వాత పుణె నుంచి ధర్మానాయక్ భార్యకు ఫోన్ వచ్చినట్లు పోలీసుల గుర్తించారు. ఆ కాల్ డేటాను విశ్లేషించగా, అతను ధర్మానాయక్ అనే షాకింగ్ విషయం తెలిసింది. అనంతరం ధర్మానాయక్‌‌తోపాటు అతని భార్య, ఇద్దరు బంధువులతో పాటు మరో నలుగురిని అధికారికంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    గుర్తు తెలియనని వ్యక్తిని బంధువుల సాయంతో హత్య చేసి, కారులో కూర్చొబెట్టి, అనంతరం వాహనంపై పెట్రోల్ పోసి కాలబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025