Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్
సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు. కార్మికులకు దసరా బోనస్‌ను ముందుగానే ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం)డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సెక్రటేరియట్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ,సింగరేణి కార్మికుల పోరాట శక్తి అందరికీ ప్రేరణ అని, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కీలకమైనదని ప్రశంసించారు. కార్మికుల గొప్పతనాన్ని తమ ప్రభుత్వం గౌరవిస్తోందని,అందుకే దసరా బోనస్ ముందుగా అందజేస్తున్నామని అన్నారు.
బోనస్ కోసం ప్రభుత్వం రూ.796 కోట్ల వ్యయం
ప్రతి కార్మికుడికి లక్షా 90 వేల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు,ఇది గతేడాది కంటే 20 వేలు ఎక్కువని ప్రకటించారు. ఈ బోనస్ కోసం ప్రభుత్వం రూ.796 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అదనంగా,సింగరేణి లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇచ్చి,కనీసం 33 శాతం లాభాలను పంచుతామని హామీ ఇచ్చారు.