#Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం తొలిసారి సమావేశమవుతోంది. సమావేశాల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ఎఐఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇటీలవ జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అసంతృప్తితో ఉంది. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను, తాము సమావేశాలను బహిష్కరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నందున ఆయన (అక్బరుద్దీన్) కుర్చీలో ఉంటే తాము ప్రమాణం చేయలేమని రాజాసింగ్ అన్నారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎంపిక
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పీకర్ ఎన్నికయ్యాక, సెషన్‌కు సంబంధించిన ఎజెండా, ఇతర అంశాలు ఖరారు చేయబడతాయి. స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే జి. ప్రసాదరావు పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైన మూడో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, పలు అంశాలపై కొన్ని తీర్మానాలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, తెలంగాణ శాసనసభకు 4 కిలోమీటర్ల పరిధిలో ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సభలు నిర్వహించొద్దని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.