Page Loader
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఆదివారం మరో విస్తరణ చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరి కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. తన మంత్రివర్గాన్ని సామాజిక సమీకరణాల ఆధారంగా విస్తరించిన సీఎం రేవంత్‌... ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్‌ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గడ్డం వివేక్‌, లక్ష్మణ్‌, శ్రీహరిలను మంత్రులుగా తీసుకోవడం ద్వారా కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నలుగురికి పెరిగింది.

Details

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ గా రామచంద్రునాయక్

అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి ఇప్పటి వరకు మంత్రి పదవులు లభించడం గమనార్హం. ఇదిలా ఉండగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ చేపట్టారు. ఈయన ఎస్టీ లంబాడా వర్గానికి చెందినవారు. ఇప్పటికే ఎస్టీ ఆదివాసీలకు చెందిన సీతక్క మంత్రిగా ఉన్నప్పటికీ, తాజా విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కేబినెట్‌లో చేరిన కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో పాటు, ఇప్పుడు శ్రీహరి కూడా మంత్రి పదవి చేపట్టారు.