Page Loader
Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ? 
నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ప్రధానంగా ఆయన ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా, మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండటంతో పాటు అనేక జిల్లాల్లో మంత్రులు లేరు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం.

వివరాలు 

శాఖల వారీగా.. సచివాలయంలో సమీక్షలు

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను మరోసారి కలసి, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించి వచ్చేందుకే ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి వర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని హైకమాండ్‌కు వివరించనున్నారు. ఇప్పటికే జాబితా రూపొందించినప్పటికీ, దానికి ఆమోదముద్ర పొందేందుకు ఈ పర్యటన కొనసాగుతుందని తెలిసింది. మరోవైపు, నేటి నుంచి శాఖల వారీగా రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షలు చేపట్టనున్నారు.