Loading...
Telangana: జులై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
జులై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

Telangana: జులై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలపై నైతిక బాధ్యత స్వీకరించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా ఈ బంద్‌ను జులై 24న నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.

వివరాలు

గోడపత్రిక ఆవిష్కరణ..

ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కె. మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి టి. నాగరాజు, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వెంకటస్వామి, ఏఐఎఫ్‌డీఎస్‌కు చెందిన పల్లె మురళీ బంద్‌కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

అనంతరం వారు బంద్‌ నిర్వహణకు గల కారణాలను వివరిస్తూ విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు.

ADVERTISEMENT